తరగతుల సారాంశము

తరగతుల సారాంశము

తరగతి 1

భావనలు

జుమ్ కు స్వాగతం — ఒక పెద్ద ప్రభావాన్నిచూపటానికి దేవుడు సామాన్యమైన విషయాలు చేసే సాధారణ ప్రజలను ఎలా ఉపయోగిస్తాడు అనేది మీరు చూస్తారు.
విధేయతను వారికి నేర్పించండి - శిష్యునిగా ఉ౦డడ౦, శిష్యుని తయారుచేయటం, మరియు సంఘము అంటే ఏమిటి అనే సారాంశాన్ని కనుక్కొనండి.
ఆధ్యాత్మిక శ్వాస — శిష్యునిగా ఉండటం అంటే మనము దేవుని నుండి వింటాము మరియు మనము దేవునికి విధేయత చూపిస్తాము.

సాధనాలు

S.O.A.P.S. బైబిలు పఠనము - దేవుని వాక్యాన్ని అర్థ౦ చేసుకోవడానికి, విధేయత చూపి౦చటానికి, వాటిని ప౦చుకోవడానికి మీకు సహాయపడే రోజువారీ బైబిలు అధ్యయనానికి ఒక పనిముట్టు.
జవాబుదారి బృందాలు — ఒకే లింగానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు వారానికి ఒకసారి కలిసే, బాగా జరుగుతున్న ప్రాంతాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మరియు దిద్దుబాటు అవసరమైన చర్యలను బహిర్గతం చేసుకోవడానికి ఒక సాధనము.

సాధన చేయండి

జవాబుదారి బృందాలు - ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులుగా విడిపోయి జవాబుదారీతనంతో కూడిన ప్రశ్నలపై పనిచేయండి. (45 నిమిషాలు)

తరగతి 2

List 100 people you know, 3 categories: those who follow Jesus, those who don't follow Jesus, those they're not sure about

భావనలు

నిర్మాతలు వర్సెస్ వినియోగదారులు - దేవుడు అనుదిన అనుచరులను మరింత యేసుని వలె నుండుటకు చేసే నాలుగు ప్రధాన మార్గాలను మీరు కనుగొంటారు.

సాధనాలు

ప్రార్థనా చక్రం — ప్రార్ధనలో ఒక గంట గడపడం ఎంత సులభమో చూడండి.
100 మంది జాబితా — మీరు మీ సంబంధాలలో ఒక మంచి గృహనిర్వాహకుడిగా నుండుటకు సహాయపడటానికి రూపొందించబడిన ఒక సాధనం.

సాధన చేయండి

ప్రార్థనా చక్రం — ప్రార్థనలో 60 నిమిషాలు వ్యక్తిగతంగా గడపండి.
100 మంది జాబితా - మీరు స్వంతముగా 100 మంది జాబితాను సృష్టించండి. (30 నిమిషాలు)

తరగతి 3

Whoever can be trusted with very little can also be trusted with much. - Jesus. Breathe in, hear, breathe out, obey and share. Giving God's blessings
Obey, do, practise, share, teach, pass on

భావనలు

ఆధ్యాత్మిక ఆర్థిక వ్యవస్థ — దేవుని ఆర్థిక వ్యవస్థ ఈ లోక వ్యవస్థతో ఎలా భిన్నముగా ఉంటుందో నేర్చుకోండి. ఇప్పటికే ఇచ్చిన దానిలో ఎవరైతే నమ్మకస్థులై ఉంటారో వారి మీద దేవుడు ఎక్కువ పెట్టుబడి పెడతాడు.
సువార్త — మానవుని మనుగడ ప్రారంభము నుండి యుగాంతము వరకు నున్న దేవుని సువార్తను పంచుకొను ఒక మార్గమును నేర్చుకోండి.

సాధనాలు

బాప్తిస్మ౦ — యేసు చెప్పెను, “మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు…” దీన్ని ఆచరణలో పెట్టడమెలా అనేది నేర్చుకోండి.

సాధన చేయండి

దేవుని కథను పంచుకోండి — ఇద్దరు లేదా ముగ్గురు బృందాలుగా విడిపోవాలి మరియు దేవుని కథను పంచుకోవడం సాధన చేయాలి. (45 నిమిషాలు)

తరగతి 4

భావనలు

అత్య౦త గొప్ప ఆశీర్వాద౦ — కేవల౦ ఒక్క యేసు అనుచరునుని మాత్రమే కాక, రాబోవు తరములలో విస్తరి౦పజేసే అన్ని ఆధ్యాత్మిక కుటు౦బాలను తయారు చేయడానికి ఒక సామాన్యమైన పద్ధతిని నేర్చుకు౦టారు.
చూచుటకు కన్నులు - దేవునిరాజ్యం ఎక్కడ లేదో చూచుట ప్రారంభించండి. సాధారణంగా ఇటువంటి ప్రదేశాలలోనే ఎక్కువ పనిచేయాలని దేవుడు కోరుకుంటాడు.
బాతు పిల్ల శిష్యరికం — శిష్యులను చేసే పనిలో బాతుపిల్లలు ఏమి చేయాలో నేర్చుకోండి.

సాధనాలు

3 నిమిషాల సాక్ష్య౦ — యేసు మీ జీవితాన్ని ఎలా ప్రభావిత౦ చేశారో మీ సాక్ష్యాన్ని మూడు నిమిషాల్లో ఎలా ప౦చుకోవాలో నేర్చుకో౦డి.
ప్రభువు రాత్రి భోజన౦ — యేసుతో మనకున్న సన్నిహిత సహవాస స౦బ౦ధ కొనసాగి౦పుని వేడుక చేసుకోవడానికి ఇది ఒక సామాన్యమైన మార్గ౦. జరుపుకొనుటకు ఒక సామాన్యమైన మార్గ౦ నేర్చుకోండి.

సాధన చేయండి

మీ సాక్ష్యాన్నిపంచుకోవడం — ఇద్దరు లేదా ముగ్గురు సమూహాలుగా విడిపోయి మరియు మీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడం సాధన చేయండి. (45 నిమిషాలు)
ప్రభువు రాత్రి భోజన౦ — ఒక బృందముగా కలిసి ఇలా చేయడానికి సమయ౦ తీసుకోండి. (10 నిమిషాలు)

తరగతి 5

భావనలు

నెమ్మది గల వ్యక్తి — నెమ్మది గల వ్యక్తి అంటే ఎవరు, మీరు ఒక వ్యక్తిని కనుగొన్నప్పుడు అతను నెమ్మది గలిగిన వ్యక్తి అని తెలుసుకోవడం ఎలా అని నేర్చుకుంటారు.

సాధనాలు

ప్రార్ధనా నడక - ఇది ఇతరుల కొరకు ప్రార్థించమనే దేవుని ఆజ్ఞకు లోబడటానికి ఒక సులభమైన మార్గము. మరియు ఇది కేవలం ఇట్లానే ఉంటుంది – నలుప్రక్కలా నడుస్తూ దేవుని ప్రార్థించుట!

సాధన చేయండి

B.L.E.S.S. ప్రార్థన — ఇతరుల కోస౦ ప్రార్థి౦చే మార్గాలను మీకు గుర్తుచేయడానికి సామాన్యమైన ఒక జ్ఞాపకమును సాధన చేయండి. (15 నిమిషాలు)
ప్రార్థన నడక — ఇద్దరు లేదా ముగ్గురు బృందాలుగా విడిపోయి బయట సమాజంలోకి వెళ్ళి ప్రార్ధనా నడకను సాధన చేయండి. (60-90 నిమిషాలు)

తరగతి 6

భావనలు

విశ్వాస్యత — శిష్యులకు ఏమి తెలుసు అనే విషయ౦ ప్రాముఖ్యమే - కానీ వారికి తెలిసిన దానితో వారు ఏమి చేయాలి అన్నది అతి ప్రాముఖ్య౦.

సాధనాలు

3/3 బృంద ఏర్పాటు — ఒక 3/3 బృందం, యేసు అనుచరులు కలవటానికి, ప్రార్ధించటానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి, సహవాసం, విధేయత మరియు పంచుకోవడంలో వారు నేర్చుకున్న దానిని సాధన చేయడానికి ఒక మార్గము.

తరగతి 7

భావనలు

శిక్షణా చక్రం — శిక్షణా చక్రాన్ని నేర్చుకుని అది శిష్యుని తయారీకి ఎలా వర్తిస్తుందో పరిగణించండి..

సాధన చేయండి

3/3 బృందము - 90 నిమిషాలు మీ బృందమంతా కలసి 3/3 బృందముల ఏర్పాటును సాధన చేయండి.

తరగతి 8

భావనలు

నాయకత్వ శిబిరాలు - ఎవరైతే నడిపించుటకు పిలవబడినామని తలుస్తారో వారు తమ నాయకత్వమును అభివృద్ధి చేసుకొనుటకు, సేవచేయుటను సాధన చేయుటకు నాయకత్వ శిబిరము ఒక మార్గము.

సాధన చేయండి

3/3 బృందము - 90 నిమిషాలు మీ బృందమంతా కలసి 3/3 బృందముల ఏర్పాటును సాధన చేయండి.

తరగతి 9

భావనలు

సరళీకృతం కాని - శిష్యులను తయారు చేయడం అనేది ఎలా క్రమంగా ఉండనక్కరలేదో చూడండి. ఒకే సమయంలో పలు విషయాలు జరగవచ్చు.
వేగము — విస్తరణ ముఖ్య విషయం మరియు ఇంకా త్వర త్వరగా విస్తరించడం ముఖ్యం. వేగం ఎందుకు ప్రాముఖ్యమో చూడండి.
రెండు సంఘములలో భాగము - వెళ్లడం మరియు ఉ౦డడ౦ ద్వారా యేసుని ఆజ్ఞలకు లోబడడ౦ ఎలాగో నేర్చుకోండి.

సాధన చేయండి

3 నెలల ప్రణాళిక — రాబోయే మూడు నెలలకు మీరు జుమ్ సాధనములను ఎలా అమలు చేస్తారు అనే దాని కొరకు మీ ప్రణాళికని సృష్టించండి మరియు పంచుకోండి. (60 నిమిషాలు)

తరగతి 10 - ఉన్నత స్థాయి శిక్షణ

భావనలు

అనుసంధానించబడిన వాటిలో (నెట్వర్కుల్లో) నాయకత్వ౦ — విస్తరించే సంఘాలు కలపబడి ఉండటం మరియు ఒక విస్తరించబడిన, ఆధ్యాత్మిక కుటు౦బ౦గా కలిసి జీవి౦చడ౦ ఎలాగో నేర్చుకు౦టా౦.

సాధనాలు

శిక్షణ పరిశీలపట్టిక — విస్తరింపజేసే శిష్యులను తయారుచేసే విషయానికొచ్చేసరికి, మీ స్వంత సామర్థ్యాలు మరియు నష్టపరిచే విషయాలను త్వరగా అంచనా వేయటానికి ఈ శిక్షణ పరిశీలపట్టిక ఒక శక్తివంతమైన సాధనం.
పీర్ మెంటరింగ్ గుంపులు — ఇది ప్రముఖ 3/3 గ్రూపులను ప్రారంభించే వ్యక్తులను కలిగి ఉండే సమూహం. ఇది కూడా ఒక 3/3 ఆకృతిని అనుసరిస్తుంది మరియు మీ ప్రాంతంలో దేవుని పని యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఒక శక్తివంతమైన మార్గంగా ఉంది.

సాధన చేయండి

తోటివారిని శిష్యరికం చేసే బృందాలు - ఇద్దరు లేదా ముగ్గురు సమూహాలుగా విడిపోయి మరియు తోటివారిని శిష్యరికం చేసే బృందాల నిర్మాణం ద్వారా పనిచేయండి. (60 నిమిషాలు)