జుమ్ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)


ఇది నిజంగా 100 శాతం ఉచితం?

అవును, ప్రాధమిక సంస్కరణలు లేవు, ట్రయల్ పీరియడ్‌లు లేవు, ఉత్పత్తుల అమ్మకాలు లేవు. ఉచితంగా మనము పొందుకున్నాము. ఉచితంగా ఇస్తాము.

శిక్షణ తీసుకోవడానికి మీకు ఎంత వయస్సు ఉండాలి?

13 ఏళ్ళు మరియు ఆపై వయస్సు గల వ్యక్తులకు శిక్షణను మేము సిఫార్సు చేస్తున్నాము. ఒకవేళ మీకు ఈ వయస్సు కంటే తక్కువ ఉన్న ఒక చిన్న బిడ్డ ఉంటే ఆ బిడ్డకు దీనిని నేర్చుకోవడంవల్ల మేలు కలుగుతుంది అని భావిస్తే వారిని పాల్గొననివ్వడి.

ఒకవేళ ఎవరైనా శిక్షణ పొందాలనుకుని మరియు వారికి ఇ-మెయిల్ చిరునామా లేకపోతే ఏమిటి?

బృందములోని కనీసం ఒక వ్యక్తి అయినా ఉపయోగించుచున్న ఈ-మెయిల్ ఖాతాను కలిగివుంటే వారు వెబ్ సైట్ యొక్క అన్ని లక్షణాల (ఫీచర్ల)కు ప్రవేశించి అందుబాటులో ఉండవచ్చు. ఎవరైతే బృందముతో ఉన్నప్పుడు మీడియాను (మాధ్యమము) వీక్షిస్తారో, వారితో బృందము ప్రారంభించడానికి ఇక ఇమెయిల్ చిరునామా అవసరం లేదు.

ఒక శిక్షణ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు నేను పాఠాలను ముందుగా ఎలా చూడగలుగుతాను?

"అవలోకనం"(సారాంశము) విభాగాన్ని ఒకసారి సరిచూడండి. ఇది భావనలు, సాధనాలు మరియు ప్రతి తరగతి కొరకు మీ గ్రూపు ఏమి ఆచరిస్తుందో వాటిని ప్రధానంగా గుర్తిస్తుంది.

శిక్షణ యొక్క విషయం (కంటెంట్) ఏమిటి?

విషయసూచికలో ఉన్నటివంటి విభాగం అయిన విషయ సారాంశమును మీరు వీక్షించవచ్చు లేదా మార్గదర్శక పుస్తకం ని డౌన్ లోడ్ చేసుకొని, శిక్షణలో ఉన్న విషయాన్ని సమీక్షించి, లేదా లాగిన్ (ప్రవేశం) చేసి ఒక బృందమును ప్రారంభించండి. అయితే తరగతి యొక్క మొదటి పేజీలో "అన్వేషించే తరగతి" ఎంచుకోండి. ఇది పూర్తయినట్టు గుర్తింపు చేయకుండానే శిక్షణా విషయం ద్వారా మీరు శిక్షణకు వెళ్లడానికి ఇది వీలు చేస్తుంది.

శిక్షణకు ముందు ముద్రణ (మార్గదర్శ పుస్తక) ప్రతులను చేయాలనుకుంటున్నాను. నేను ఎలా చేయవచ్చు?

ప్రతి పేజీ యొక్క పైన ఉన్న ''గురించి'' ట్యాబ్ మీదకి రావటం ద్వారా మీరు ఎప్పుడూ మార్గదర్శ పుస్తకాన్ని కనుగొనవచ్చు.

నేను అనుకోకుండా తరువాత బటన్ కొట్టాను నేను వెనక్కి వెళ్లి మళ్ళీ ఒక వీడియో వీక్షించాలనుకుంటున్నాను. నేను ఎలా వెళ్లగలుగుతాను?

తరగతి లో సంచరించటం కొరకు తరగతి యొక్క దిగువన “మునుపటి” మరియు “తదుపరి” బటన్లను ఉపయోగించండి. డ్యాష్ బోర్డ్ నుంచి మీరు బృందము యొక్క తరగతి సంఖ్యను (క్లిక్ ) నొక్కగలరు మరియు నేరుగా ఆ తరగతికి వెళతారు.

ఎంతోమంది ఉన్నతమైన లేదా భ్రహ్మాండమైన (DMM or CPM) శిక్షకులు ఉన్నారు, కాబట్టి జుమ్ ఎందుకు అవసరం?

అంతర్జాల (ఆన్ లైన్) శిక్షణ కంటే ప్రత్యక్ష శిక్షణ ఉత్తమమైనది. ఆన్ లైన్ శిక్షణ ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమములను ఎన్నడూ భర్తీ చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు, పరిమితమైన అందుబాట్లు, అవగాహన, లభ్యత, అధికారిక ప్రకటన, మరియు ఇంకా అనేక ఇతర కారణాల వల్ల, అనేక మంది వ్యక్తులు ప్రత్యక్ష శిక్షణా తరగతులకు హాజరు కాగలిగి యుండినప్పటికీ హాజరు కాలేక పోతున్నారు. జుమ్ అటువంటి వారికి అధిక నాణ్యత గల ప్రవేశస్థాయి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి చేసే ప్రయత్నం. ఇతరుల నుంచి లభించే అనేక రకాల ప్రత్యక్ష శిక్షణల వలెనే అవే సిద్ధాంతాలను ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా, ఒక వ్యక్తి జుమ్ నుండి శిక్షణ పొందినప్పుడు, వారు చాలా సులభంగా నేర్చుకొన్న దానితో వారి స్వంత బృందమును ప్రారంభించి మరియు జుమ్ ను ఉపయోగించి ఇతరులకు శిక్షణను సులభతరం చేయవచ్చు. విస్తరింపజేసే శిష్యులను చేసే సూత్రాలను పాటించడానికి ఇది ఒక శక్తివ౦తమైన అవకాశ౦.

జుమ్ విశ్వాస ప్రకటన ఏమిటి?

జుమ్ ఒక సంస్థ ద్వారా నడపబడుట లేదు కాబట్టి, ఒక నామమాత్రపు విశ్వాస ప్రకటన లేదు. అయితే, పాల్గొనే మనమంతా ప్రపంచ వ్యాప్త సువార్తికరణ అనే నిబంధనని అంగీకరిస్తాము. Read the Covenant

నాకు నేను శిక్షణ చేయగలనా?

లేదు. ఇతర సహభాగులతో ఆచరించడానికి అవసరమైన శిక్షణ అభ్యాసములు మరియు సాధనా తరగతులు ఉంటాయి. ప్రతి తరగతిలో కనీసం 3-4 మంది వ్యక్తులు అవసరం అవుతారు లేదా మొత్తం శిక్షణను మీరు పూర్తిచెయ్యలేరు.

శిక్షణ ఎవరికి తగినది?

చదవగలిగిన, 13 ఏళ్లు లేదా ఆపైవయస్సు కలిగిన క్రీస్తు అనుచరులకు ఈ శిక్షణ తగినదే. భవిష్యత్తులో, నిరక్ష్యరాస్యులైన వ్యక్తులకు తగిన విధంగా ఈ శిక్షణ ను ఉత్పత్తి చేసే సంస్కరణ ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నది ఆ సంస్కరణ కాదు. ఇప్పుడున్నటు వంటి ఆకృతికి సరిపోయే ప్రతి వ్యక్తి ఈ శిక్షణ తీసుకోవాలని మేము నమ్ముచున్నాము.

జుమ్ ఎవరి సొంతము?

జుమ్ పథకంను ఏ సంస్థ నడిపించుట లేదు మరియు జుమ్ ఒక సంస్థ కాదు. ఇది కొంతమంది ప్రజలు హృదయపూర్వక౦గా యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి, సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త అందించడానికి, ప్రతి దేశం, గ్రామంలో దేవుని రాజ్య విస్తరణకు, దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునట్లు భారం కలిగిన వారి కలయిక. జుమ్ పథకం యొక్క ఆలోచన యోనాతాను పథకం యొక్క నాయకత్వ సమావేశములో ఉద్భవించింది, కానీ ఇప్పుడు ఆ సమూహం దాటి సుదూరంగా వ్యాపించింది. యోనాతాను పథకం ప్రపంచ వ్యాప్తంగా శిష్యులను అభివృద్ధి పరచడం కోసం కట్టుబడి ఉన్న ప్రజల ఒప్పందం.

ప్రణాళిక చేయబడ్డ మూడు దశలు ఏవి?

దశ 1:
మొదటి దశ సంయుక్త రాష్ట్రాలు (అమెరికా) మరియు ఆంగ్లభాష పై దృష్టి పెడుతుంది. దేశంలోని ప్రతి 5,000 మందికి నాలుగు నుంచి పన్నెండు మంది చొప్పున కలిగిన శిక్షణా బృందాన్ని పురికొల్పడమే తొలి లక్ష్యం. వీటిలో ప్రతి శిక్షణా బృందము రెండు మొదటి తరం సంఘములు, అవి కూడ తిరిగి పునరుత్పత్తి చేసే సంఘములను ప్రారంభించాలని సవాలు చేయబడుతుంది. సంయుక్త రాష్ట్రాలు (అమెరికా) కోసం లక్ష్యం 65,000 కంటే ఎక్కువ ఆంగ్ల భాష జుమ్ (zúme) బృందాలు మరియు 130,000 సంఘములు ప్రారంభించడం.

దశ 2:
మొదట దశలో శిక్షణ పొందుకొనిన సంఘములు ఈ ప్రోజెక్ట్ ను ప్రపంచములోని ఇతర ప్రధాన భాషలలోనికి అనువదించి అందరికి చేరవేయుట గూర్చి రెండవ దశ శిక్షణ కేంద్రికృతమై ఉండును. ఈ ప్రాజెక్టు తరువాత పేర్కొనబడిన బాషలలో ప్రారంభించబడుతుంది: అంహరిక్, అరబిక్, బెంగాలి, భోజ్పూరి, బర్మీస్, చైనీస్ (మేండరిన్), చైనీస్ (కేంటోనీస్), ఫార్సీ, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హవుసా, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జాపనీస్, కన్నడ, కొరియన్, ఖురుదిష్, లావో, మైథిలి, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబి (తూర్పు), పంజాబి (పడమర), పోర్చుగీస్, రష్యన్, సోమాలి, స్పానిష్, స్వాహిలి, తమిళ్, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నమీష్, యోరుబా.

దశ 3:
మూడవ దశ, మొదటి దశ మరియు రెండవ దశ సంఘములు శిష్యులను తయారు చేసే ఒక దర్శనముతో, ప్రతి చోట ప్రతి జాతిలో నుండి ప్రపంచవ్యాప్తంగా సమకూర్చుకోవటానికి దృష్టిని కేంద్రీకరిస్తుంది. జుమ్ పథకం మన తరంలో శిష్యులను విస్తరింపజేసి భూగోళాన్ని నింపడానికి ఉనికిలో ఉంది. మా మిషన్ ని వేగవంతం చేయడం కొరకు, మరియు యుఎస్ (అమెరికా) కు వెలుపల ఉన్న ప్రతి 50,000 మంది వ్యక్తుల మధ్య ఒక జుమ్ శిక్షణ బృందము మరియు రెండు సాధారణ సంఘముల ఏర్పాటే లక్ష్యంగా బృందములు వ్యూహాత్మకంగా పనిచేయడానికి (పట) పరిష్కారములు అభివృద్ధి చేసి పంపిణీ చేస్తున్నాము.


ఇది జుమ్ అని ఎందుకు పిలవబడుతున్నది?

జుమ్ అంటే గ్రీకులో పులిపిండి అని అర్థం. మత్తయి 13:33 యేసు ఇలా చెప్పసాగాడు, "పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది." సాధారణ ప్రజలు సాధారణ వనరులను ఉపయోగించి, దేవుని రాజ్యానికి అసాధారణ ప్రభావాన్నిఎలా చూపగలరో ఇది ఉదహరిస్తోంది. ప్రతి పొరుగు వారిని చేరుకోవడానికి సాధారణ విశ్వాసులను సన్నద్ధం చేయడం మరియు శక్తివంతం చేయడమే జుమ్ లక్ష్యం.

ఆ శిక్షణను ఏ భాషలలో అనువదిస్తారు?

పేర్కొనబడిన బాషలలో ఈ ప్రాజెక్ట్ మొదటిగా ప్రారంభము అవుతుంది మరియు ఈ శిక్షణ సామగ్రిని అనువాదం చేసి ఇతర భాషలలో అందుబాటులోనికి తెచ్చుటకు ఆశక్తి కనపరచు వారికి అవకాశం ఇవ్వబడును: అంహరిక్, అరబిక్, బెంగాలి, భోజ్పూరి, బర్మీస్, చైనీస్ (మేండరిన్), చైనీస్ ( కేంటోనీస్), ఫార్సీ, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హవుసా, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జాపనీస్, కన్నడ, కొరియన్, ఖురుదిష్, లావో, మైథిలి, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబి (తూర్పు), పంజాబి (పడమర), పోర్చుగీస్, రష్యన్, సోమాలి, స్పానిష్, స్వాహిలి, తమిళ్, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నమీష్, యోరుబా. ఈ ప్రాజెక్ట్ యొక్క తాజా అభివృద్ది సమాచారం తెలుసుకొనుటకుభాష తర్జుమా పురోగతిని చూడండి.

శిక్షణదారులు క్రమపర్చబడటం లేదా వ్యవస్థీకృతంగా ఉండటం ద్వారా గ్రూపులు ఏవిధంగా ప్రారంభమవుతున్నాయి?

అది వారిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ శిక్షణదారులు ఒక నిర్ధిష్ట సంఘము లేదా వర్గీకరణ లేదా నెట్ వర్క్(అనుసంధానించబడిన బృందము) నుంచి వచ్చినట్లయితే, కొత్తగా ఏర్పడ్డ బృందాలు ఇప్పటికే ఉన్న సంఘములకు, వర్గీకరణ లేదా నెట్ వర్క్ లతో అనుసంధానం కావడం అనేది అత్యంత సహజమైన విషయం. అయితే కావలిస్తే, ప్రారంభించే బృందాల నుంచి కొత్త నెట్ వర్క్ రూపుదిద్దుకోవచ్చు. మూడో ప్రత్యామ్నాయం ఏమిటంటే కొత్త బృందాలు ఇప్పటికే అనుసంధానించబడి ఉన్న (నెట్ వర్క్) సాధారణ సంఘములతో కలవడం. జుమ్ ను అభివృద్ధిపరుస్తున్న వారిలో అనేక మంది వ్యక్తులు అటువంటి నెట్ వర్క్ ల నుండి వచ్ఛారు, కావున, కావాలనుకుంటే ఆ విధంగా ఏర్పాటు చేయడానికి మేం సహాయపడగలం.

నా మూడు నెలల ప్రణాళికను ఎవరు చూడగలరు?

మీరు మాత్రమే మీ ప్రణాళికని చూస్తారు, దానిని మీరు మీ బృందముకు అనుసంధానించినట్లైతే, అప్పుడు మీ బృంద నాయకుడు మరియు సహనాయకులు మీ మూడు నెలల ప్రణాళికని చూడగలుగుతారు. మీ ప్రణాళిక మీ శిక్షకునికి కు కూడా కనబడనుంది. మీరు శిక్షణ కోరుకోకపోతే, మీ ప్రొఫైల్ (ఛాయారూపం) కు వెళ్లి “శిక్షణ నిరాకరించు" ను శిక్షణా ప్రాధాన్యతగా ఏర్పాటు చేయండి.

నా మూడు నెలల ప్రణాళికని నేను ముద్రించుకోవచ్చా?

అవును, మీరు ముందుగా మీ ప్రణాళికని భద్రపరుచుకోండి (సేవ్ చేయండి), తరువాత మీ ప్రణాళిక క్రిందకి రండి మరియు "ప్రింట్ సేవ్డ్ ప్లాన్" బటన్ మీద క్లిక్ చేయండి.

తరువాత నా మూడు నెలల ప్రణాళికని నేను (ఎడిట్) మార్చుకోవచ్చా?

అవును, మీరు ఏ సమయంలోనైనా మీ ప్రణాళికకు తిరిగి వెళ్లి, దానిని మార్చుకోవచ్చు. మీ ప్రణాళిక దిగువన "సేవ్" నొక్కినట్లు (భద్రపరచినట్లు) నిర్ధారించుకోండి.

నా బృందములోని వ్యక్తులతో ముచ్చడించడానికి (చాట్ చేయడానికి) జుమ్ ఒక మార్గాన్ని ఇస్తుందా?

ఈ సమయంలో కాదు. మీ బృందము యొక్క ప్రతి సభ్యుడు ప్రవేశం పొంది (లాగిన్ సృష్టించి), మీ జుమ్ బృందముకు కలపబడాలని మేం సిఫారసు చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి సభ్యుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని విషయాలను చూసే సదుపాయం ఉంటుంది. తరువాత ఆ బృందము తదుపరి సమాచారం కొరకు, వారు కావాలనుకున్న ఏదైనా వర్తమాన వేదికను (మెసేజింగ్ ఫ్లాట్ ఫారం) (ఐ మెసేజ్, వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపు మొదలైనవి) ఉపయోగించవచ్చు.


జుమ్ పథకం (ప్రాజెక్ట్) యొక్క లక్ష్యాలు:

జుమ్ అంటే గ్రీకులో పుల్లని పిండి అని అర్థం. మత్తయి 13:33 లో యేసు ఇలా అన్నాడు, “పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.” సాధారణ ప్రజలు సాధారణ వనరులను ఉపయోగించి, దేవుని రాజ్యానికి అసాధారణ ప్రభావాన్ని ఎలా చూపగలరో ఇది ఉదహరిస్తోంది. మన తరంలో శిష్యులను విస్తరి౦పజేయడం ద్వారా భూగోళాన్ని సంపూర్ణ౦ చేయడానికి సాధారణ విశ్వాసులకు సన్నద్ధతను, శక్తియుక్తిని కలిగి౦చడమే జుమ్ లక్ష్యం.

ప్రాధమికంగా శిష్యులను తయారు చేయుటకు మరియు సాధారణ సంఘ స్థాపనకు కావలసిన విస్తరణ సూత్రాలు, ప్రక్రియలు మరియు అభ్యాసములలో పాల్గొనువారిని సిద్ధపరచుటకు ఒక అంతర్జాల శిక్షణా వేదికను జుమ్ ఉపయోగిస్తుంది.

భాషా


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress