జూమ్ తర్ఫీదును గురించి
ప్రాధమికంగా శిష్యులను తయారు చేయుటకు మరియు సాధారణ సంఘ స్థాపనకు కావలసిన విస్తరణ సూత్రాలు, ప్రక్రియలు మరియు అభ్యాసములలో పాల్గొనువారిని సిద్ధపరచుటకు ఒక అంతర్జాల శిక్షణా వేదికను జుమ్ ఉపయోగిస్తుంది.
జుమ్ పథకం (ప్రాజెక్ట్) యొక్క లక్ష్యాలు:
జుమ్ అంటే గ్రీకులో పుల్లని పిండి అని అర్థం. మత్తయి 13:33 లో యేసు ఇలా అన్నాడు, “పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.” సాధారణ ప్రజలు సాధారణ వనరులను ఉపయోగించి, దేవుని రాజ్యానికి అసాధారణ ప్రభావాన్ని ఎలా చూపగలరో ఇది ఉదహరిస్తోంది. మన తరంలో శిష్యులను విస్తరి౦పజేయడం ద్వారా భూగోళాన్ని సంపూర్ణ౦ చేయడానికి సాధారణ విశ్వాసులకు సన్నద్ధతను, శక్తియుక్తిని కలిగి౦చడమే జుమ్ లక్ష్యం.
ప్రాధమికంగా శిష్యులను తయారు చేయుటకు మరియు సాధారణ సంఘ స్థాపనకు కావలసిన విస్తరణ సూత్రాలు, ప్రక్రియలు మరియు అభ్యాసములలో పాల్గొనువారిని సిద్ధపరచుటకు ఒక అంతర్జాల శిక్షణా వేదికను జుమ్ ఉపయోగిస్తుంది.
జుమ్ లో పది తరగతులు, ఒక్కొక్కటి రెండు గంటల చొప్పున ఉంటాయి:
- ఈ వీడియో ఆడియోలు శిష్యులను విస్తరింపజేయుట కొరకు ప్రాథమిక సూత్రాలను తెలియజేయుచున్నాయి.
- గుంపుగా కలసి చర్చించుట ద్వారా పంచుకోబడిన దానిని ఆలోచించుట కొరకు సహాయపడుతుంది.
- సామాన్యమైన అభ్యాసములు మీగుంపు నేర్చుకొనిన దానిని ఆచరణలో పెట్టుటకు సహాయపడతాయి.
- మీగుంపు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండటానికి తరగతి యొక్క సవాళ్లు తరగతికి తరగతికి మధ్యలో సహాయపడతాయి.
ఎలా మొదలు పెట్టాలి:
- ఒకవేళ మీరు ఇంకా లాగిన్ (ప్రవేశం) సృష్టించనట్లయితే, దయచేసి దానిని చేయండి.
- 3-11 మంది స్నేహితులను ఆహ్వానించండి. శిక్షణ యొక్క సాధన మరియు మూలకాలకు కనీసం 3-4 గురి బృందము అవసరమవుతుంది.
- మీ స్నేహితులతో కలిసి గడుపుటకు ఒక సమయాన్ని కేటాయించండి.
- అంతర్జాలమును (ఇంటర్ నెట్) వినియోగించగలిగిన ఒక పరికరము మీకుండునట్లుగా చూసుకోండి.
మీ మొదటి కూడిక కొరకు ఇష్టప్రకారమైన సిద్ధపాటు:
- జుమ్ మార్గదర్శక పుస్తకము పొందుకొనుము (డౌన్ లోడ్ జుమ్ గైడ్ బుక్)
- ఒకవేళ మీకిష్టమైతే, మీ బృంద సభ్యుల కొరకు మీరు ప్రతులను ముద్రించుకోవచ్చు.
- టీవీ లేదా ప్రొజెక్టర్ (తెరపై చూపు పరికరము) నకు అనుసంధానించుట ద్వారా మీ బృందములో ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని వీక్షించగలరు.