తరగతి (సెషన్ ) 1

జుమ్ కు స్వాగతం
డౌన్లోడ్ (పొందుకొనుము)

ఈ సెషన్ కొరకు మీరు డిజిటల్ pdf ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ చెప్పిన విధంగా మీరు కొనసాగించవచ్చు, అయితే మీ గ్రూపుకు చెందిన ప్రతి సభ్యుడు రాబోయే తరగతుల (సెషన్) కొరకు ముద్రించబడిన కాపీని కలిగి ఉండునట్లుగా దయచేసి ధృవీకరించుకోండి.

మార్గనిర్దేశ పుస్తకము పొందుకొనుము (డౌన్ లోడ్ గైడ్ బుక్)

బృంద ప్రార్ధన (5ని:)
ప్రార్ధనతో ప్రారంభించండి. పరిశుద్ధాత్మ లేనిదే ఆత్మీయ గ్రహింపు, పరివర్తన సాధ్యం కాదు. ఈ తరగతిలో ఆయన నడిపింపు కొరకు ఆయనను ఆహ్వానించడానికి అందరూ కలసి కొంచెం సమయం ప్రార్ధనలో గడపండి.

చూడండి మరియు చర్చించండి (15ని;)
చూడండి
దేవుడు చిన్న విషయాలకు సాధారణ ప్రజలను ఉపయోగించి పెద్దమొత్తంలో ప్రభావాన్ని చూపిస్తాడు. దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వీడియోలో చూడండి.
చర్చించండి
యేసు తన అనుచరుల్లో ప్రతి ఒక్కరు తన గొప్ప ఆజ్ఞకు లోబడాలని ఉద్దేశి౦చి ఉంటే, మరి కొ౦దరు మాత్రమే శిష్యులను ఎ౦దుకు చేస్తున్నారు?

చూడండి మరియు చర్చించండి (15ని;)
చూడండి
శిష్యుడు అంటే ఏమిటి? మీరు ఒక శిష్యుడిని ఎలా తయారు చేస్తారు? యేసు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ - ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపటం అనునవి యేసుని ఒక అనుచరునికి మీరు ఎలా బోధిస్తారు?
చర్చించండి
  1. మీరు ఒక చర్చి గురించి ఆలోచించినపుడు, మీ మనస్సులో ఏం అనిపిస్తుంది?
  2. మీరు ఛాయాచిత్రంలో చూసిన దానికి మరియు వీడియోలో "సామాన్యమైన సంఘము" గా వివరించబడిన దానికి మధ్య వ్యత్యాసమేమిటి?
  3. విస్తరింపజేయటానికి ఏది సులభమని మీరు అనుకుంటున్నారు, ఎందుకు?

చూడండి మరియు చర్చించండి (15ని;)
చూడండి
మనం శ్వాస లోపలికి తీసుకుంటాం. శ్వాస బయటకు విడుస్తాము. మనము సజీవంగా ఉన్నాము అనడానికి ఇదే ఆధారం, ఆత్మీయ శ్వాస కూడా ఇలాంటిదే.
చర్చించండి
  1. దేవుని స్వరాన్ని వినడాన్ని, గుర్తించడాన్ని నేర్చుకోవాల్సిన అవసర౦ ఎ౦దుకు ఉ౦ది?
  2. ప్రభువు స్వరము వినుట మరియు స్పందించుట అనునవి నిజముగా శ్వాస తీసుకొనుట, వదులుట లాంటివా? ఎందుకు లేదా ఎందుకు కాదు?

వినండి మరియు వెంట చదవండి (3ని:)
చదవండి

S.O.A.P.S. బైబిలు అధ్యయనం

దేవుని ను౦డి క్రమముగా వినుట అనునది ఆయనతో మనకున్నవ్యక్తిగత స౦బ౦ధములో ఒక కీలకమైన అ౦శ౦, మరియు ఆయన మన చుట్టూ తాను చేస్తున్న పనిలో మనం విధేయతతో నిమగ్నమై ఉ౦డడ౦ మన సామర్థ్యానికి స౦బ౦ధి౦చిన విషయ౦.

మీ జుమ్ మార్గనిర్దేశ పుస్తకంలో “S.O.A.P.S. బైబిల్ అధ్యయన” విభాగాన్ని కనుగొనండి మరియు ఆడియో సారాంశాన్ని వినండి.

వినండి మరియు వెంట చదవండి (3ని:)
చదవండి

బాధ్యతగల (జవాబుదారీ) సమూహాలు

యేసు అనుచరులైన ప్రతి ఒక్కరు చేసే పనికి, ఆలోచనకి, మాట్లాడే ప్రతిమాటకి ఒకరోజు దేవుని దగ్గర జవాబు చెప్పవలసి వస్తుంది అని బైబిల్ మనకు చెప్పుచున్నది. జవాబుదారీతనం గల గుంపులు సిద్ధపాటు కలిగియుండుటకు ఒక గొప్ప మార్గము!

మీ జుమ్ మార్గనిర్దేశ పుస్తకంలో “జవాబుదారీతనం గల గుంపులు” విభాగాన్ని కనుగొనండి, మరియు క్రిందనున్న ఆడియో వినండి.

సాధన (45ని:)
విడిపోవటం
ఒకే లింగం కలిగిన ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సమూహాలుగా విడిపోవుట.
పంచుకొనుట
తదుపరి 45 నిమిషాలు జవాబుదారీతనం ప్రశ్నల ద్వారా కలిసి పనిచేయండి – మీ యొక్క "జవాబుదారీతనం గల గుంపులు" విభాగంలో 2వ జాబితా జుమ్ మార్గనిర్దేశ పుస్తకం.

ముందుకు చూడటం

అభినందనలు! మీరు సెషన్ 1 (మొదటి తరగతి ) పూర్తి చేశారు.

తరువాతి తరగతి (సెషన్) కొరకు సిద్దపడుటకు క్రింద కొన్నితదుపరి దశలు ఉన్నాయి.
పాటించండి
ఇప్పటి నుండి మరల కలిసే వరకు S.O.A.P.S. బైబిల్ అధ్యయనం చేయండి. మత్తయి 5-7 పై దృష్టి సారించి, కనీసం రోజుకు ఒకసారైనా చదవండి. S.O.A.P.S. నమూనాను ఉపయోగించి దినచర్య పుస్తకాన్ని పెట్టండి.
పంచుకొనుట
ఈ తరగతిలో మీరు నేర్చుకున్నవాటిని ఉపయోగించి ఎవరితో 'జవాబుదారీతనం గుంపు' ప్రారంభించాలని దేవుడు కోరుతున్నాడో ప్రార్థనలో ఆయనను అడగండి. ఆ వ్యక్తిని కలవక ముందు అతని యొక్క పేరును గుంపుతో పంచుకోండి. 'జవాబుదారీతనం గుంపు' ప్రారంభించాలని మీతో ప్రతి వారము కలవాలని అతనిని కలసి తెలియజేయండి.
ప్రార్థన
దేవుడు మీలోను, మీ చుట్టూ ఉన్న వారిలోను పనిచేయాలని ఆహ్వానించి, మీరు ఆయనకు విధేయులుగా ఉండునట్లు సహాయము చేయమని ప్రార్థించండి!
#జుమ్ ప్రాజెక్ట్ (పథకం)
మీ S.O.A.P.S. బైబిలు అధ్యయనానికి స౦బ౦ధి౦చిన ఒక చిత్రాన్ని తీసుకొని దాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకోండి.