Zúme శిక్షణతో ప్రారంభించండి
కొంతమంది స్నేహితులను సేకరించండి లేదా ఇప్పటికే ఉన్న చిన్న సమూహంతో శిక్షణ పొందండి. మీ స్వంత శిక్షణా ప్రణాళికను సృష్టించండి మరియు మీ పురోగతిని ట్రాక్ చేయండి.
యేసు అనుచరులుగా, మనం ప్రతిరోజూ లేఖనాలను చదవాలి. ప్రతి వారం కనీసం 25-30 బైబిల్ అధ్యాయాలను చదవడం మంచి మార్గదర్శకం. రోజువారీ అధ్యయనంలో S.O.A.P.S. బైబిల్ పఠన పద్ధతిని ఉపయోగించడం వలన మీరు అర్థం చేసుకోవడం, పాటించడం మరియు మరింత వాక్యమును పంచుకోవడంలో సహాయపడుతుంది. S.O.A.P.S. అనగా:
యేసు అనుచరులెవరైనా ఉపయోగించగల సమర్థవంతమైన బైబిలు అధ్యయన పద్ధతిని తెలుసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఇది సులభమైన మార్గం.
ఎస్ - నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
“ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి”. యెషయా 55:8-9
ఓ – ఒక మానవుడుగా, నాకు తెలిసినది చాలా తక్కువ మరియు ఎలా చేయాలో నాకు తెలియదు. కానీ దేవుడు ఏ విధంగానూ పరిమితమైన వాడు కాదు. ఆయన సమస్తమును చూచును మరియు ఆయన సమస్తమును ఎరుగును. ఆయన దేనినైనా చేయగలడు.
ఏ – దేవునికి సమస్తమును తెలియును గనుక ఆయన మార్గములు ఉత్తమమైనవి, నేను నా స్వంత మార్గములో పనులను చేయకుండా ఆయన మార్గములను అనుసరించినట్లైతే నా జీవితంలో నేను విజయాన్ని పొందుకుంటాను.
పి – ప్రభువా, మిమ్మును మరియు ఇతరులను సంతోషపరచే మంచి జీవితమును ఎలా జీవించవలేనో నాకు తెలియదు. నా మార్గములు తప్పుడు మార్గములోనికి దారితీస్తాయి. నా ఆలోచనలు గాయపరుస్తాయి. నేను అనుసరించు చుండగా పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించును గాక.
ఎస్ – నేను ఈ వచనములను మరియు ఈ అన్వయింపును నా స్నేహితుడైన స్టీవ్ తో పంచుకుంటాను, అతడు చాలా కష్టముల గుండా వెళ్తున్నాడు మరియు అతడు ఎదుర్కొంటున్న పరిస్థితులలో ప్రాముఖ్యమైన నిర్ణయముల కొరకు అతనికి నడిపింపు అవసరము.
కొంతమంది స్నేహితులను సేకరించండి లేదా ఇప్పటికే ఉన్న చిన్న సమూహంతో శిక్షణ పొందండి. మీ స్వంత శిక్షణా ప్రణాళికను సృష్టించండి మరియు మీ పురోగతిని ట్రాక్ చేయండి.